ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి – రాయపాటి

-

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, పోలీసు రాజ్యం నడుస్తుందని విమర్శించారు. బుధవారం టిడిపి నేత బాల కోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాయపాటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పట్టాభి విషయంలో పోలీసుల తీరు సరైంది కాదన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

ఏపీలో శాంతిభద్రతను క్షీణించాయని, పోలీసులు వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా టిడిపి నేత చంద్రబాబు కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని కోరారు. ఈనెల రెండవ తేదీన బాల కోటిరెడ్డి పై కాల్పులు జరగగా ఆయన చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. నేడు టిడిపి నాయకులు బాలకోటిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం రాయపాటి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news