ఎన్టీఆర్ ఇంటి చుట్టూ స్టార్ డైరెక్ట‌ర్ల ప్ర‌దక్షిణ‌లు… వీళ్లంతా క్యూలోనే…

-

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్‌ సినిమా పూర్తి చేసుకుని ఎప్పుడు వస్తాడా ? ఎన్టీఆర్ అని ఎందరో వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు మీద మరో 10 నెల‌ల‌కు పైగా వర్క్ చేయాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు పలువురు స్టార్ డైరెక్టర్లు ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు ఎన్టీఆర్ ను కలిసి క‌థ‌లు వినిపించే పనిలో బిజీగా ఉన్నారట.

వీరంతా ఎన్టీఆర్ ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ నుంచి బయటకు వస్తాడా ? అని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీతో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తోనే దాదాపు ఫిక్స్ అయిపోయినట్టు బోగట్టా. ఇక కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఆట్లీ విజయ్‌తో చేస్తోన్న బిగిల్ సినిమా కంప్లీట్ చేసుకున్న వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక కొరటాల శివ సన్నిహితులకు ఆయన డైరెక్షన్లో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ ఎప్పటి నుంచో లైన్ లో ఉన్నాడు. జనతా గ్యారేజ్ నుంచి ఈ ప్రాజెక్టు న‌లుగుతూనే వస్తోంది.

ఇక కేజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగులో చేయబోయే రెండు సినిమాల్లో ఎన్టీఆర్ ప్రాజెక్టు ఒకటి. అంటే ఒక్క సుకుమార్ మినహా మిగిలిన టాప్ లైన్ డైరక్టర్లు అందరూ ఎన్టీఆర్ ప్రాజెక్టులను పట్టుకుని వేచివున్నారు. మరి వీళ్లలో ఎవరిది ముందు స్టార్ట్ అవుతుందో అన్నది మార్చి నాటికి కానీ తెలియదు. అయితే వీరంద‌రు త‌మ క‌థ‌లు ఎన్టీఆర్‌కు చెప్పి.. ఆయ‌న‌తో ఓకే చెప్పించుకునేందుకు రెడీగా ఉన్నారు. మ‌రి వీరిలో ఎన్టీఆర్ ఎవ‌రికి ఓకే చెపుతారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news