ఏపీ ప్రజలకు బిగ్ షాక్..పెరిగిన విజయ పాల ధర

-

ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్. ఏపీలో విజయ పాలధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రైతుల పాల సేకరణ ధరలో నిర్వాహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో తెలిపారు. మార్చి ఒకటి నుంచి విజయ పాలధర అర లీటర్ ప్యాకెట్ పై రూ. 1 చొప్పున పెరగనుంది.

ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని కృష్ణ మిల్క్ యూనియన్ ఒక ప్రకటనలో తెలిపింది. పెరుగు, చిన్న పాల ప్యాకెట్లు ఇతర పాల పదార్థాల విక్రయ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. నెలవారి పాల కార్డుదారులకు మార్చి 9 వరకు పాతదరలే వర్తిస్తాయని తెలిపారు. అర లీటరు విజయ లో ఫ్యాట్ ధర రూ.27 కాగా, ఎకానమీ రూ. 29, అలాగే ప్రీమియం రూ. 31, ఇక స్పెషల్ రూ. 36, గోల్డ్ రూ.37, టీ-మేట్ రూ.34 అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news