ప్రీతి.. చచ్చిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల రాజేందర్. చైతన్యం ను చంపేస్తే ఉన్మాదం వస్తుందని వెల్లడించారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అని నిలదీశారు ఈటల రాజేందర్. అసైన్డ్ భూములు తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్ట పరిహారం చెల్లించాలన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క sc, St అధికారులు లేరని.. అసెంబ్లీలో ఒక్క దళిత మహిళ ఎమ్మెల్యే లేరని వెల్లడించారు ఈటల రాజేందర్. జస్టిస్ చంద్రచుడ్ …ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు వెయ్యిమంది మధ్యలోనే వదిలివేసి పోతే, 500 మంది చనిపోతున్నారు అని చెప్పారన్నారు. మనం ఎటు పోతున్నాం.. ఆ వేదింపులకు పరాకాష్ట ప్రీతి మరణం… ప్రీతి.. చచ్చిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ ఇచ్చారని ఆరోపణలు చేశారు ఈటల రాజేందర్. రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సమాజం అథః పాతాళంలోకి పోతుందన్నారు.