తెలంగాణ మహిళలకు శుభవార్త చెప్పింది. మార్చి 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’ అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సర్కార్ అమలు చేయనుంది. మహిళా దినోత్సవం సందర్బంగా ప్రభుత్వం ఈ ‘ఆరోగ్య మహిళ’ అనే నూతన కార్యక్రమం చేపట్టనుంది.
సిపీఆర్ పై నిర్దేశిత వర్గాలకు శిక్షణ పూర్తి చేయాలని.. జిల్లా స్థాయి వైద్య, పంచాయితీ, మున్సిపల్, పోలీసు శాఖల సిబ్బంది పర్యవేక్షించాలని ఈ మేరకు ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశించారు. ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని… కంటి వెలుగు మరింత ప్రభావవంతంగా నిర్వహించాలన్నారు. అన్ని కార్యక్రమాలు ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు -ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్.