కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మూడో సారి నోటీసులు

-

వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ…కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మూడో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న హైదరాబద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని రెండు రోజుల క్రిందట నోటీసు ఇచ్చిన సీబీఐ..ఎంపి తండ్రి భాస్కర్ రెడ్డి నీ కూడా విచారణకు హజరు కావాలని కోరింది. 6న హాజరు కాలేనని చెప్పిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి..తప్పక 6న హాజరు కావాలని పులివెందుల లోని ఎంపి ఇంటికి శనివారం రాత్రి వెళ్ళి సమాచారం ఇచ్చింది.

ఎంపి లేక పోవడంతో ఎంపీ తండ్రికి వైఎస్ భాస్కర్ రెడ్డి కి సమాచారం ఇచ్చారు సీబీఐ అధికారులు. ఎంపి అవినాష్ రెడ్డి తో పాటు, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నీ కూడా 6న నే విచారణకు రావాలని తెలిపినట్లు సమాచారం. నిన్న రాత్రి పులివెందుల లోని ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సీబీఐ అధికారులు.. మొన్న రాత్రి ఎంపి అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి 6 తేదీ హైదరాబాద్ కు మరోసారి విచారణకు రావాలని నోటీస్ ఇచ్చింది సీబీఐ. 6న విచారణకు రాలేననీ, మరోసారి వస్తాను అని రిప్లై ఇచ్చారు ఎంపి అవినాష్ రెడ్డి. ఈ విషయమై సీబీఐ అధికారులు ఇంటికి వచ్చి సోమవారం ఖచ్చితంగా హాజరు కావాలని తేల్చి చెప్పిన సీబీఐ..అది చెప్పడానికే పులివెందుల వచ్చారు. ఎంపి లేకపోవడంతో ఎంపి తండ్రి భాస్కర్ రెడ్డి కి సమాచారం చెప్పి వెళ్లింది సీబీఐ.

Read more RELATED
Recommended to you

Latest news