ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వైసీపీకి అనుకూలంగానే ఉన్నారని అన్నారు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి. విజయనగరం సుజాత కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో వైసీపీ నాయకులు, కార్పొరేటర్లతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ వైసీపీకి అనుకూలంగానే ఉన్నారని, కేవలం 15 శాతం మంది మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. అశోక్ గజపతిరాజు జనంలోకి వచ్చారంటే ఎన్నికలు వచ్చినట్లేనని ఎద్దేవా చేశారు. కేవలం ఎలక్షన్ల సమయంలో మాత్రమే ఆయన ప్రజలకు కనిపిస్తారని అన్నారు. విజయనగరంలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. శాసనమండలి అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ని గెలిపించుకోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.