ప్రీతి ఆత్మహత్య కాదు, హత్యే – ప్రీతి తండ్రి నరేందర్

-

ప్రీతి ఆత్మహత్య కాదు, హత్యేనని ఆరోపణలు చేశారు ప్రీతి తండ్రి నరేందర్ నాయక్‌. ఇవాళ డీజీపీ ఆఫీస్ కు వచ్చిన ప్రీతి తండ్రి నరేందర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. మాకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదు.. ఈ కేసు పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ కి కోరాడనికి వచ్చామన్నారు. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని కోరుతామని… నిన్న మట్టేవాడా పోలీసులు మా ఇంటికి వచ్చి విచారించారని వెల్లడించారు.

ఘటన పై మరో సారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని.. ఒకవేళ టాక్సికాలజీ వచ్చిన కాజ్ ఆఫ్ డెత్ క్లియర్ తెలియదు… టాక్సికాలజీ కోసం తీసుకున్న నమూనాలు, అప్పుడే ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారన్నారు. సరైన రిపోర్ట్ రాదని డాక్టర్లు చెప్పారు… వరంగల్ లో ఘటన జరిగిన రోజు MGM లో నమూనాలు తీసుకొని ఉంటే టాక్సీ కాలజీ రీపోర్ట్ సరైన ఫలితం తేలేదని వెల్లడించారు ప్రీతి తండ్రి నరేందర్ నాయక్‌.

Read more RELATED
Recommended to you

Latest news