గుండె పోటులు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో నిన్న అయిదుగురు చనిపోయారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి రాకేష్, నిర్మల్ జిల్లా కుంటాలలోని ఓ స్కూల్ హెచ్ఎం లాలన్న (50), కామారెడ్డి జిల్లా జానకంపల్లి కుర్దు గ్రామంలో ఓ ఆయా (54), ఎల్లారెడ్డిలో అహ్మద్ (36), సిద్దిపేట జిల్లా కడవేర్గు గ్రామానికి చెందిన శ్రీనివాస్ (36) గుండెపోటుతో చనిపోయారు.
మరి ఈ గుండె పోటులు వ్యాక్సిన్ వేసుకున్న వారికే వస్తున్నాయా ? అంటే అవుననే అంటున్నారు కొందరు నిపుణులు. కేవలం వ్యాక్సిన్ కారణంగా… 40 ఏళ్ల లోపు ఉన్న వారికి రాలిపోతున్నారని సమాచారం అందుతోంది. ఈ తరుణంలో.. వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నామని జనాలు భయపడుతున్నారు. కాగా, ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కార్డియోపల్మోనరి రిససిటేషన్ లో లక్ష మందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని యుద్ద ప్రాతిపాదికన ప్రారంభించింది. ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చినవారికి అపర సంజీవనిలా పనిచేసే ఆటోమేటిక్ ఎక్స్ టర్నల్ డిఫీబ్రిలేటర్ పరికరాలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉంచనుంది.