కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని అంటారు. అయితే, ఇది మంచిదో చెడుదో చెప్పలేం కానీ.. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రత్యర్థులకు జుట్టును చేతికి అందించేందుకు, ఎదుటి పక్షం సునాయాసంగా పైచేయి సాధించేందుకు ఇది చాలా మేరకు ఉప యోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పురా తన పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్‌లో ఇంకా పిడివాద రాజకీయాలు, వ్యూహలేమి కనిపిస్తున్నందునే ప్రత్య ర్థులు ఎంతో నమ్మకంగా కాంగ్రెస్ ఢీకొడుతున్నారు. తాజాగా తెలంగాణలోని హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నిక తెరమీదికి వచ్చింది.
అయితే, ఇక్కడ గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచాం కాబట్టి ఇప్పుడు కూడా తామే విజయం సాధించాలని , పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ అనుకుంది. ఈ మాట అయితే అనుకుంది కానీ, దీనికి తగిన విధంగా వ్యూహం నిర్మించుకుని ముందుకు పోగలిగిందా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే నిలిచిపోయింది. ఇదిలావుంటే, అధికార పార్టీ ఇక్కడ ఘోర పరాజయం పాలైంది.
దీంతో కసితో రగిలిపోతు న్నారు అధికార పార్టీ అధినేత కేసీఆర్. ఎట్టిపరిస్థితిలోనూ నల్లగొండలో పట్టు సాధించాలంటే.. ఇక్కడ గెలిచి తీరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ను ఢీకొనేందుకు అన్ని దారులను వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌లో అంతర్గత కుంపటిని రాజేయడం వల్ల.. తన పనిసులువు అవుతుందని భావించిన కేసీఆర్ అండ్ టీం.. తమ చేతికి మట్టి అంటకుండా తన పార్టీలోని కొందరు నేతలను సెలక్ట్ చేసి.. (వారు రేవంత్‌కు సన్నిహితంగా ఉండేవారిని ఎంచుకున్నారు.) కాంగ్రెస్‌లో చిచ్చు పుట్టేలా రేవంత్‌ను రెచ్చగొడుతన్నారు.
ఈ విషయం తెలుసుకోలేక పోయిన రేవంత్ అండ్ కాంగ్రెస్ కోటరీ.. ఇప్పుడు టికెట్ విషయంలో వారికే కేటాయించాలని ఒకరంటే.. కాదు.. వారికే కేటాయించాలని మరొకరు పట్టుబడుతున్నారు. దీంతో ఈ వివాదం కాంగ్రెస్ తీవ్ర దుమారం ఏర్పడుతోంది. ఇలా అంతర్గత కుమ్ములాటతో ఇబ్బంది పడుతున్న కాగ్రెస్‌ను ఓవర్ టేక్ చేసి.. సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.