ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం నడుస్తోంది – ఆర్ కృష్ణయ్య

-

ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం నడుస్తోందని మండిపడ్డారు రాజ్యసభ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. చట్ట సభల్లో 50 శాతం రిసర్వేషన్ పేట్టే వరకు ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. 56 శాతం ఉన్న వారికి వరుస అన్యాయం జరుగుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి సత్తుపల్లి వెళ్తూ మార్గమధ్యంలో సూర్యాపేట వద్ద ఆగిన హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. 14 శాతమే ఇప్పటివరకు బీసీలకు అవకాశాలు వచ్చాయని.. అవకాశం రానప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందన్నారు.

దేశ సంపదలో బీసీల భాగస్వామ్యం ఎక్కువ కానీ.. రాజ్యాంగపరంగా న్యాయమైన వాటా రావడంలేదన్నారు. బీసీల అభివృద్ధి అడ్డుకుంటే.. బీసీ కుల సంఘాలు ఎం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటి ప్రభుత్వాలు అగ్రకుల ధోరణితో ఉన్నయన్నారు. బీసీ ప్రధాని ఉన్నారు కాబట్టి బీసీలు గట్టిగా కొట్లాడాలని పిలుపునిచ్చారు ఆర్ కృష్ణయ్య. జరుగుతున్న అన్యాయంపై బీసీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ప్రతి కుటుంబానికి 50 లక్షల సబ్సిడీ ఋణాలు ఇవ్వాలన్నారు. రాజకీయ అవసరాల కోసం బీసీలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఏప్రిల్ 3 చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. పార్లమెంట్ ముందు చేపట్టే ఈ ధర్నాని విజయవంతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news