బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇంట్లో ఈడీ సోదాలు

-

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భూములు తీసుకుందన్న అభియోగాల కేసులో ఈడీ సోదాలు చేపట్టింది.  తనిఖీల్లో దిల్లీలో ఉన్న తేజస్వీ యాదవ్ ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టింది. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ముంబయిలోని ఆయన కుటుంబానికి చెందిన పదులకుపైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. లాలూ సన్నిహితుడు, ఎమ్మెల్యే అబు దొజానా ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆధారాలను గుర్తించేందుకు ఈ తనఖీలు చేపట్టినట్లు ఈడీ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పుడు మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news