మోదీకి జై కొట్టిన ఎంపీ సుమలత.. త్వరలోనే బీజేపీలో చేరిక

-

ఎవరేమనుకున్నా తనకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్​ అన్నారు. మోదీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో భారత్​ స్థిరంగా ఉందని.. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సుమలత చెప్పారు.

సుమలత వ్యాఖ్యలతో ఆమె బీజేపీలోకి రావడం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.   స్వంతంత్ర ఎంపీగా నాలుగేళ్లుగా  చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు.. ముఖ్యంగా బహిరంగ సభలు​ ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సుమలత చెప్పారు. ఈ కారణంగానే తనకూ ఓ సపోర్ట్​ అవసరం అని అనుకున్నట్లు తెలిపారు.

‘ఎవరు ఏమనుకున్నా.. నాకు నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంది. ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. అందుకే బీజేపీకి నా మద్దతు తెలుపుతున్నా. ఈ నిర్ణయం సుమలత కోసం కాదు. మండ్య భవిష్యత్​ కోసం. ఆత్మగౌరంలో రాజీపడే బదులు రాజకీయాల నుంచి తప్పుకుంటా. మండ్య కోసం ఈ లోకాన్ని విడిచి వెళ్లడానికే ఇష్టపడతా. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించడానికి కాదు. ఈ జిల్లాలో మార్పు తీసుకురావడానికి.. ఇక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి.’  -సుమలత అంబరీశ్​, మండ్య స్వతంత్ర ఎంపీ

Read more RELATED
Recommended to you

Latest news