బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సత్యవతి రాథోడ్. బండి సంజయ్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత రాజకీయాల విలువలు తగ్గిపోయాయి అన్నారు. ఈడీలు, బోడీలు మమ్మల్ని ఏమీ చేయలేవని అన్నారు సత్యవతి రాథోడ్. కేసులకు భయపడేది లేదని, ఎవరిపై ఏ కేసులో పెడుతున్నారో భారత ప్రజలందరికీ తెలుసు అన్నారు.
దొంగ స్వామీజీలు హైదరాబాద్ లో పట్టపగలు పట్టుపడితే కేసులు ఉండవని మండిపడ్డారు. బండి సంజయ్ కి సిగ్గుండాలి అన్నారు సత్యవతి రాథోడ్. 119 నియోజకవర్గాలలో పోటీ చేస్తే వంద సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సమాజం ఊరుకోదని హెచ్చరించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయనకు మహిళలు అంటే ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. బిజెపి నేతలు భవిష్యత్తులో జైలుకు వెళ్లే రోజులు వస్తాయని జోష్యం చెప్పారు.