వాస్తు: ఇలా భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలని పెంచచ్చు..!

-

చాలా మంది భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. ఇటువంటివేమీ జరగకుండా ఆనందంగా ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలని అనుసరించడం మంచిది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు మరి ఇక వాటి కోసం తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్రూం లో తాజా పూలని ఉంచడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచి అందమైన కర్టెన్లని బెడ్ రూమ్ లో ఉంచడం వలన కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది భార్యా భర్తల మధ్య అన్యోన్యతను పెంచుతుంది.

అలానే భార్యా భర్తల మధ్య అనురాగం పెరగాలంటే శుక్రవారం నాడు ఒకరి కోసం ఒకరు పెర్ఫ్యూమ్స్ ని కొనుగోలు చేయడం మంచిది ఇది కూడా వాళ్ళ మధ్య ప్రేమని పెంచేందుకు సహాయ పడుతుంది. బెడ్రూం లో ఫోన్ టీవీ వంటి వాటిని ఉంచొద్దు. ఎలక్ట్రానిక్స్ తక్కువగా ఉంటే ప్రేమ పెరుగుతుంది. అదే విధంగా ప్రతి రోజు సాంబ్రాణి పొగ సాయంత్రం పూట వేస్తే కూడా భార్యా భర్తల మధ్య అన్యోన్యతని పెంచుకోవచ్చు. ఇలా ఈ విధంగా భార్యా భర్తల మధ్య ప్రేమని పెంచుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు. ఆనందంగా ఉండచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news