RRR చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన

-

కోట్లాదిమంది ఇండియన్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు అని వేయికళ్లతో ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు వేడుక ఈరోజు ఘనంగా జరిగింది. తెలుగు పాట చరిత్ర సృష్టించింది. 130 కోట్ల మంది గర్వించేలా తెలుగోడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని “నాటు నాటు” పాటకి పట్టం కడుతూ అకాడమీ అవార్డ్స్ సంస్థ ఆస్కార్ అవార్డుని ప్రకటించింది. “నాటు నాటు” పాటకు ఆస్కార్ దక్కడంపై సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కడంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ స్పందించారు. నాటు నాటు అనే ప్రసిద్ధ పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకొని చరిత్ర సృష్టించినందుకు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గొప్ప గుర్తింపు తెచ్చి ఆస్కార్ అవార్డు పొందడం తెలుగు సినిమాకి గర్వకారణం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

Read more RELATED
Recommended to you

Latest news