95వ ఆస్కార్​ వేడుకల్లో క్లీన్ స్వీప్ చేసిన ‘ఎవ్రీథింగ్‌’ .. ఏకంగా 7 పురస్కారాలు’

-

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ‘95వ ఆస్కార్‌అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన ఈ వేడుకకు హాలీవుడ్ సినీ తారలతో పాటు ఆస్కార్​కు నామినేట్ అయిన వారంతా హాజరయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రబృందం కూడా ఈ ఈవెంట్​లో పాల్గొంది. పాల్గొనడమే కాకుండా నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్​ను దక్కించుకుంది.

ఇక ఈ వేడుకల్లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ అనే సినిమా క్లీన్ స్వీప్ చేసింది. ఏకంగా ఈ మూవీ ఏడు అవార్డులను అందుకుని విజయకేతనం ఎగురవేసింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే వరించాయి. మరోవైపు, మన దేశం నుంచి నామినేట్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’పాటకు ఆస్కార్‌ దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అవార్డును సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news