ఏపీ సీఎం జగన్ ప్రబుత్వానికి రాష్ట్ర హైకోర్టులో బారీ షాక్ తగిలింది. ఒకపక్క గత చంద్రబాబు ప్రభుత్వ నిర్ణ యాలను తిరగదోడుతున్న క్రమంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వస్తున్న నేప థ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు మరింత దుమారం రేపే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ను హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది. ఇది విద్యుత్ పీపీఏలకు సంబంధించిన వ్యవహారం కావడం, వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కావడంతో అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
జీవో 63 ఏంటంటే.. చంద్రబాబు హయాంలో కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. పర్యావరణ అనుకూలత ఏర్పడడం కోసం.. జల, పవన విద్యుత్ స్థానంలో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలని సూ చించింది. ఇలా చేసే రాష్ట్రాలకు కేంద్రం నుంచి కొంత మేరకు సాయం కూడా అందుతుందని పేర్కొంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. వీటినే పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ షిప్(పీపీఏ)లుగా పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలతో ఈ ఒప్పందాలు చేసుకున్నారు. ఆయా సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పీపీఏలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ పీపీఏల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం భారీ మొత్తాన్ని ప్రజల సొమ్మును వృధా చేశారనియూనిట్ విద్యుత్ రూ.4కే లభిస్తుంటే.. ఆయా సంస్థలతో రూ.5, రూ.6కు కూడా ఒప్పందాలు చేసుకున్నారని, ఇందులో చాలా లొసుగులు ఉన్నాయని పేర్కొంటూ వీటి రద్దును ప్రతిపాదిస్తూ.. జీవో 63ను కూడా విడుదల చేశారు. అయితే, ఇది రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ అలజడి రేపింది. పీపీఏలో జోలికి వెళ్లొద్దంటూ.. కేంద్రం నుంచి జగన్‌కు వార్నింగులు కూడా వచ్చాయి. అయినా కూడా జగన్ ముందుకు వెళ్లారు.
ఎట్టి పరిస్థితిలోనూ పీపీఏలను కొనసాగించేదిలేదని తేల్చిచెప్పారు. దీంతో ఆయా సంస్థలుకోర్టులో కేసులు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో విచారించిన రాష్ట్ర హైకోర్టు.. సదరు పీపీఏలను కొనసాగించాల్సిదేనని, గత ఒప్పందాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేస్తూ.. జీవో 63 ను కొట్టివేసింది. ఇప్పుడు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఏదేమైనా.,. పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయానికి సమర్ధన రాకపోగా.. ఇప్పుడు ఇలా న్యాయ వివాదంలో చిక్కుకోవడం విస్మయ పరుస్తోంది.