హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, తమిళ నటుడు సముద్రఖని, స్వాతిరెడ్డి (కలర్స్ స్వాతి), శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, శ్రీవిద్య ప్రధాన తారాగణంగా నటించిన అంథాలజీ ‘పంచతంత్రం’. ది వీకెండ్ షో సమర్పణలో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై హర్ష పులిపాక దర్శకత్వంలో అఖిలేష్ వర్ధన్, స్రుజన్ ఎరబోలు ఈ అంథాలజీని నిర్మించారు.
గత ఏడాది ‘పంచతంత్రం’ను డిసెంబర్ 9న థియేటర్స్‌లో విడుదల చేశారు. అందులో కాన్సెప్ట్స్, నటీనటుల ప్రతిభ, టెక్నీషియన్స్ టేకింగ్ ఆడియెన్స్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఐదు కథల హృదయ స్పందనగా ‘పంచతంత్రం’ను రూపొందించారని క్రిటిక్స్ తమ రివ్యూస్ ద్వారా అభినందించారు. ప్రేమ, భయం, చావు, నమ్మకం, లక్ష్యాలను సాధించటం అనే అంశాలతో ఐదు వేర్వేరు కథల సమాహారంగా ఈ అంథాలజీని రూపొందించారు. మార్చి 22 నుంచి ఈటీవీ (Win) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది.