దేశంలో అప్పులు చేసే ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపినే – రఘురామ కృష్ణంరాజు

-

దేశంలోనే అప్పులు చేసే ప్రజలు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నారని గణంకాలు చెబుతున్నాయని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రాష్ట్రంలో 168% మంది ప్రజలు అప్పులు తీసుకొని, పన్నులు కడుతున్నారని, ప్రజలను అప్పులపాలు చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని, పేదవాళ్లందరినీ ధనవంతుల్ని చేస్తామని జగన్ మోహన్ రెడ్డి గారు మనోహరంగా చెబుతుంటే పేదలు ఎందుకు అప్పులు చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు.

చిన్న మొత్తాలకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అంటే పేదవాడు ధనవంతుడైనట్టా?, పేదవాడు మరింత పేదవాడైనట్టా?? అని ఆయన నిలదీశారు. ఇదే గణాంకాలను చూపెట్టి ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని కోరారు. జనం వెర్రి వెధవలు, మనం చెప్పిన అబద్ధాలను గతంలో నమ్మారు… మళ్లీ చెబుదాం… మళ్లీ నమ్మిద్దాం అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఉందని, నమ్మని వారిని గుర్తించి ఎన్నికలకు రాకుండా అడ్డుకోవాలని భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే దుర్మార్గులకే మంచి రోజులులాగా అనిపిస్తున్నాయని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారిపై ప్రభుత్వ పెద్దలు కక్ష కట్టి తప్పుడు కేసులను బనాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news