మే 02 న రానున్న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. పవన్ పొలిటికల్ కాంపెయిన్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది.

తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ ని ఇస్తూ అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. ‘ధర్మం కోసం యుద్ధం’ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మే 2న ఉదయం 9 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియజేసారు. ఆ అప్డేట్ టీజర్ అని పేర్కొన్నారు. ఒక యాక్షన్ కట్ తో అదిరిపోయే టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ.. రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news