బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్ గురించి తెలియని వారుండరు. ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటారు బంగ్లా క్రికెటర్ షకీబ్ అల్ హసన్. అయితే, తాజాగా ఈ బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ ఆల్ హాసన్ కు చేదు అనుభవం ఎదురయింది.
ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా ఫ్యాన్స్ చుట్టుముట్టి ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి చొక్కాలాగి ఫోటో దిగెందుకు ప్రయత్నించాడు. దీంతో అతడు కింద పడబోయాడు. అయితే వారిని ఏమనకుండానే అక్కడి నుంచి తప్పించుకుని కారు ఎక్కేసాడు. ఇటీవల ఫాన్స్ చుట్టూ ముట్టినప్పుడు కోపంతో టోపీతో కొట్టిన విషయం తెలిసిందే.