ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా లివర్ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లివర్ సమస్య అసలు ఎందుకు వస్తాయి..? దాని వెనుక కారణాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ శరీరంలో అతి పెద్ద గ్రంధి కాలేయం. జీర్ణక్రియకి సహాయం చేస్తుంది లివర్ అలానే లివర్ చాలా ముఖ్యమైన పనులకి సహాయపడుతుంది. అయితే లివర్ ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. కానీ కొన్ని కారణాల వలన లివర్ సమస్యలు వస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మందులు ఎక్కువ వేసుకోవడం:
మందులు ఎక్కువగా వాడినట్లయితే లివర్ సమస్యలు వస్తాయి వీలైనంత వరకూ తక్కువ మందుల్ని ఉపయోగించండి. ఎక్కువగా మందుల్ని ఉపయోగించొద్దు.
నూనెలు:
కలుషితమైన నాణ్యతలేని వంట నూనెల్ని ఉపయోగించడం వలన లివర్ సమస్యలు కలుగుతాయి కాబట్టి అటువంటి తప్పును కూడా చేయకండి.
పచ్చి ఆహారం తీసుకోవడం:
ఉడకని ఆహారం లేదా పచ్చి ఆహారం తింటే కానీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి అలాంటి ఆహారాన్ని తీసుకోవద్దు. పూర్తిగా ఉడికించుకుని మాత్రమే తీసుకోండి.
మద్యం తీసుకోవడం:
మద్యం వలన కూడా లివర్ సమస్యలు వస్తాయి ఎక్కువగా మద్యం తీసుకుంటే లివర్ చెడిపోతుంది కూడా.
నిద్ర:
నిద్ర కూడా మన ఆరోగ్యానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది రాత్రిపూట త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లేవడం మంచిది.
భోజనం తప్పక తీసుకోండి:
భోజనాన్ని స్కిప్ చేయడం వలన కూడా లివర్ ఆరోగ్యం పాడవుతుంది బ్రేక్ ఫాస్ట్ ని అసలు స్కిప్ చేయొద్దు. ఇది లివర్ మీద ఒత్తిడిని పెడుతుంది. అలానే ఎక్కువగా ఆహారం తీసుకుంటే కూడా లివర్ డామేజ్ అవుతుంది ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేసేందుకు లివర్ పై ఎక్కువ భారం పడుతుంది.