ఉగాది ఏ రోజు వచ్చింది..? ఉగాది 2023 తిథి, ముహూర్తం వివరాలు ఇవే..!

-

ఉగాది తో కొత్త సంవత్సరం మొదలవుతుంది. చాలా రాష్ట్రాలలో ఉగాది పండుగని జరుపుతారు కానీ పేర్లు మాత్రం వేరు. ఈసారి ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది..? ఏ రోజున ఉగాది పండుగ ని జరుపుకోవాలి..? ఉగాది తిధి, ముహూర్తం వంటి ముఖ్య విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా ఉగాది పండుగనే తమిళ్ కర్ణాటక లో కూడా చేస్తారు.

తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ పండుగని నూతన సంవత్సరంగా భావించి జరుపుకుంటారు. ఉగాది లేదా యుగ ప్రారంభం సంస్కృతి పదాల నుండి ఉద్భవించింది. వసంత ఋతువు ప్రారంభముని ఉగాది సూచిస్తుంది. దీన్ని భారతదేశం అంతటా వేరు వేరు పేర్లు ఆచారాలు తో జరుపుతారు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని హిందువులు భావిస్తారు.

ఉగాది పండుగ నాడు ఇంటిని శుభ్రం చేస్తారు. కొత్త బట్టలు కొని వేసుకుంటారు. ఉగాది నాడు తెల్లవారుజామున లేచి నువ్వుల నూనెతో మర్దన చేసి తలస్నానం చేస్తారు వసంతరాక వెచ్చని వాతావరణం సూచిస్తుంది ఉగాది. ఉగాది నాడు షడ్రుచుల పచ్చడిని చేసుకుంటూ ఉంటారు షడ్రుచులు జీవితంలో దుఃఖం ఆనందం ని గుర్తు చేయడానికి ఉద్దేశించబడింది.

ఈసారి ఉగాది ఎప్పుడు అంటే..?

ఈసారి ఉగాది పండుగ మార్చి 22, 2023న వచ్చింది. తెలుగు ప్రజలు ఆనాడు పండుగని సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు.

ఉగాది తిథి, ముహూర్తం:

చైత్ర శుక్ల ప్రతిపద తిథి మార్చి 21, 2023 రాత్రి 10:52 గంటలకు ప్రారంభం అవుతుంది.
చైత్ర శుక్ల ప్రతిపద తిథి మార్చి 22, 2023 రాత్రి 08:20 గంటలకు ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news