తెలంగాణ ప్రతిపక్ష నేతలు రచయితలుగా బాగా పనికొస్తారు .. కేటీఆర్ ట్వీట్

-

రాష్ట్ర మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారన్న విషయం తెలిసిందే. సామాజిక అంశాలు, ప్రతిపక్ష నాయకులపై విమర్శలు, కేంద్రంపై విరుచుకు పడుతూ తరచూ కేటీఆర్ ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా మరోసారి ట్విటర్​ వేదికగా ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు.

 

తెలంగాణలో ప్రతిపక్ష నాయకులకు ఉన్న ఊహగానాలతో తప్పకుండా వారు మంచి రచయితలుగా పనికొస్తారని మంత్రి కేటిఆర్‌ ట్వీట్ చేశారు. కొవిడ్‌ డ్రగ్‌ కాంట్రాక్ట్‌ విషయంలో కేటిఆర్‌ మేనల్లుడు 10వేల కోట్లు తీసుకున్నారని….గ్రూప్‌ 1 పరీక్షల్లో కేటిఆర్‌ పీఏ సంబంధీకులకు అత్యుత్తమ మార్కులు వచ్చాయని రేవంత్‌ రెడ్డి అన్న మాటలపై కేటిఆర్‌ స్పందించారు.

రేవంత్‌ రెడ్డికి పూర్తిగా మతిపోయింది అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్​గా మారింది. ఈ ట్వీట్​కు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు కేటీఆర్​ను సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు రేవంత్​కు మద్దతిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news