బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ లాంఛనమైంది. ఎన్టీఆర్ 30 సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇవాళ జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి జాన్వీ పట్టుచీరలో హాజరైంది.
ఈ ఈవెంట్ కు జాన్వీ కపూర్ చాలా సంప్రదాయంగా వచ్చింది. లైట్ గ్రీన్ కలర్ శారీలో జాన్వీ మెరిసిపోయింది. స్లీవ్ లెస్ బ్లౌజులో తన ట్రెండీనెస్ ను కాస్త టచ్ చేసింది. ఆకుపచ్చ చీరలో చెవికి ఝుంకాలతో చాలా అందంగా కనిపించింది. హెయిర్ లీవ్ చేసి కాస్త మోడన్ గా కూడా కనిపించింది. జాన్వీ ట్రెడిషనల్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాన్వీని చీరకట్టులో చూసిన తెలుగు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ ట్రెండీ అవతార్ లో కనిపించే జాన్వీ సౌత్ సినిమా ఇండస్ట్రీకి రాగానే.. ఇక్కడి సంప్రదాయానికి తగ్గట్టుగా చీరకట్టులో రావడం చూసి కుర్రాళ్లు తెగ పొగిడేస్తున్నారు. శారీలో జాన్వీ బుట్టబొమ్మలా కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.