సూరత్ కోర్టు తీర్పుపై స్పందించిన రాహుల్ గాంధీ

-

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశించి 2019 ఎన్నికల ప్రచారం వేల కర్ణాటకలోని కోలార్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది గుజరాత్ సూరత్ లోని న్యాయస్థానం.

ఐపీసీ సెక్షన్ 504 ప్రకారం ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ స్పష్టం చేశారు. ఇందుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే జైలు శిక్ష విధించడం పై రాహుల్ గాంధీ స్పందించారు. మహాత్మా గాంధీ కొటేషన్ ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు. “నిజం, అహింస. ఇవే నా మతం. నిజమే నాకు దైవం” అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news