ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన్ను పదవికి అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు లోక్సభ సచివాలయం శుక్రవారం ప్రకటించింది.
మరోవైపు అనర్హత వేటు వల్ల రాహుల్ గాంధీ దిల్లీలోని ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేస్తారా అనే విషయంపై క్లారిటీ లేదు. పార్లమెంటు సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటితమైన రాహుల్ గాంధీకి క్రిమినల్ పరువు నష్టం కేసులో ఉన్నత న్యాయస్థానం నుంచి ఊరట లభించకపోతే.. ఆయన దిల్లీలో అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వస్తుంది. 2004లో లోక్‌సభకు ఎన్నికైనప్పటి నుంచి రాహుల్‌కు తుగ్లక్ లైనులోని 12వ నంబరు బంగళాను కేటాయించారు. రాహుల్‌కు ఊరట లభిస్తే తప్ప మార్చి 23 నుంచి నెలరోజుల్లోపు తన అధికార బంగళాను ఆయన ఖాళీచేయక తప్పదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ భద్రతా బందోబస్తును తగ్గించినందున ఆమె కూడా 2020 జూలైలో తన అధికార బంగళాను ఖాళీ చేశారు.