ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకు ముందురోజు అనగా బుధవారం రాత్రి 7-8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణగా పరిగణిస్తారు. స్వామి వారి ఆశీస్సులు ఉండాలని సంకల్పిస్తూ.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ అంకురార్పణ ఘట్టాన్ని వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో కె.ఎస్ శ్రీనివాస రాజు ఇతర ఆలాయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.