పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే దాకా… ఓ మూడునాలుగు సార్లు చాయ్ గొంతులో పడితేనే కొందరి పనులు అవుతుంటాయి. అది ఇల్లు కావచ్చు.. ఆఫీసు కావచ్చు.. షాప్ కావచ్చు.. ఏదైనా అరే చోటూ.. చాయ్ లావ్.. అరే.. చాయ్ లేకియారే… చాయ్ తేపోరా బయ్.. చాయ్ తాగి వద్దాం పదరాబయ్.. ఇలా చాయ్ చాయ్ అంటూ రోజూ జపిస్తూనే ఉంటారు జనాలు. చాయ్ మన జీవితంలో ఓ భాగం. అది గొంతులో పడగానే కాసింత ఎనర్జీతో పని చేస్తారని నమ్ముతుంటారు. సరే.. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు గానీ.. అసలు విషయం ఏంటంటే…
బీబీసీ జర్నలిస్ట్ మేఘా మోహన్ ఏదో డాక్యుమెంటరీ పనిమీద కేరళ వెళ్లిందట. అక్కడ పొన్నాయ్ అనే ఏరియాలో ఉన్న ఓ టీకొట్టు స్పెషాలిటీ గురించి అక్కడి స్థానికులు చెప్పడంతో ఆ టీకొట్టుకు వెళ్లింది మేఘా. హోటల్ చాయ్ మాస్టర్ చాయ్ ని వినూత్నంగా చేస్తాడు. సాధారణంగా స్టవ్ మీద మరగబెట్టి చేసినట్టుగా చేయడు.
డికాషన్, క్రీమ్, పాలు ఓ గ్లాస్ లో పోస్తాడు. ఆ తర్వాత గ్లాస్ పట్టుకొని కిందికి మీదికి ఒకసారి గ్లాస్ ను రెప్పపాటులో తిప్పేస్తాడు. అంతే వేడి వేడి చాయ్ రెడీ. ఇక.. మనోడి ఈ డిఫరెంట్ చాయ్ కి ఫిదా అయిన స్థానికులు చాయ్ హోటల్ కు క్యూ కడుతున్నారట. అలా మేఘా ఆ చాయ్ వాలా పనితనాన్ని తన కెమెరాలో బంధించింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
How tea is served at The Chappati Factory in Ponnani, Kerala. ?? pic.twitter.com/8cxJctMrJT
— Megha Mohan (@meghamohan) September 9, 2018