2.ఓ టీజర్.. శంకర్ మార్క్.. హాలీవుడ్ ట్రీట్

-

రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ టీజర్ గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈరోజు వినాయక చవితి సందర్భంగా 2.ఓ టీజర్ వచ్చింది. సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ ఉందని చెప్పొచ్చు. లైకా ప్రొడక్షన్స్ లో 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోలేదని టీజర్ చూస్తేనే అనిపిస్తుంది.

శంకర్ మరోసారి తన సత్తా చాటేలా 2.ఓలో ఎఫర్ట్ మొత్తం పెట్టేశాడు. శంకర్, రజిని క్రేజీ కాంబోలో సినిమా ఎలాంటి అంచనాలు ఉంటాయో వాటికి తగినట్టుగా ఈ టీజర్ ఉంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. రోబోని మించేలా ఈ 2.ఓ సినిమా ఉందని చెప్పొచ్చు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ఎనౌన్స్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news