వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తునకు కొత్త సిట్‌

-

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై ఇటీవల సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇంకెన్నాళ్ళు దర్యాప్తు చేస్తారని అధికారులను ప్రశ్నించింది. వివేకా హత్య కేసులోని విస్తృత కుట్రకోణంపై దర్యాప్తును వేగంగా పూర్తి చేసేందుకు కొత్త అధికారిని నియమించాలనీ సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని బుధవారం జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనానికి తెలిపింది. కేసు విచారణ వేగంగా సాగడం లేదని, దర్యాప్తు అధికారులను మార్చాలని హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్‌రెడ్డి సతీమణి తులసమ్మ వేసిన రిట్‌ పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం సూచనల మేరకు సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు దర్యాప్తు అధికారిగా ఉన్న సిట్‌ పర్యవేక్షణాధికారి కేశవ్‌రామ్‌ చౌరాసియానే..కొత్తగా ఏర్పాటుచేసిన సిట్‌ను డీఐజీ  పర్యవేక్షిస్తారు. ఎస్పీ స్థాయి అధికారి వికాస్‌కుమార్‌, అదనపు ఎస్పీ ముఖేష్‌శర్మ, ఇన్‌స్పెక్టర్లు ఎస్‌.శ్రీమతి, నవీన్‌ పునియా, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ అంకిత్‌యాదవ్‌లను సిట్‌లో నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను బుధవారం సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ నటరాజన్‌ సమర్పించారు. దానికి జస్టిస్‌ ఎంఆర్‌షా ఆమోదం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news