మంత్రి సీదిరి అప్పలరాజుకు షాక్ తగిలింది. డాక్టర్ అచ్చన్న సంతాప సభకు హాజరైన మంత్రి అప్పలరాజును ఎమ్మార్పీఎస్ నాయకులు, మందకృష్ణ మాదిగ అడ్డుకున్నారు. నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ అచ్చన్న మృతికి ప్రధాన కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీఎంవో నుంచి మంత్రి అప్పలరాజుకు పిలుపు వచ్చిందని, ఈ నేపథ్యంలో ఆయన విజయవాడకు వచ్చినట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
అచ్చన్న సంతాప సభలో పాల్గొనడం కోసమే విజయవాడ వచ్చానని స్పష్టం చేశారు. సీఎంవో నుంచి పిలుపు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై తనకి సమాచారం లేదన్నారు. అచ్చన్న హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండడమే తనకు ముఖ్యమని అన్నారు మంత్రి అప్పలరాజు. తనని మంత్రిగా ఉంచినా మంత్రినే.. తీసేసిన మంత్రినే అని అన్నారు. జగన్ నాయకత్వంలో 151 మంది మంత్రులతో సమానం అన్నారు.