పోస్ట్ ఆఫీస్ నుండి సూపర్ స్కీమ్.. రూ.7.5 లక్షలు.. వెయ్యి కట్టినా చాలు..!

-

ఈ మధ్య కాలం లో ఎవరికి నచ్చిన స్కీముల్లో వాళ్ళు డబ్బులని పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులని పెడితే చక్కటి లాభం పొందొచ్చు. రిస్క్ ఏమి ఉండదు. ఎక్కువ డబ్బులని పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ కూడా చాలా రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీముల వలన చాల మంది ప్రయోజనాలని పొందుతున్నారు. పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్ లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి. ఈ పేరుతో ఒక పథకాన్ని అందిస్తోంది. వడ్డీ రేటును ఏప్రిల్ 1 నుంచి పెంచింది కేంద్రం.

రిస్క్ లేకుండా రిటర్న్ పొందొచ్చు. గతంలో కన్నా ఎక్కువ రాబడి పొందొచ్చు. ఇక పూర్తి వివరాలని చూస్తే.. ప్రస్తుతం ఈ స్కీమ్‌ పై 7.7 శాతం వడ్డీ రేటు వస్తోంది. గతం లో వడ్డీ రేటు 7 శాతంగానే ఉండేది. సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలు ని కూడా మీరు పొందొచ్చు. రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చెయ్యచ్చు. ఈ స్కీములో మీరు ఎంతైనా డిపాజిట్ చెయ్యచ్చు. ప్రతి ఏడాది వడ్డీ డబ్బులు మీ అకౌంట్‌లో జమ అవుతూ ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని రెండింటినీ కలిపి మెచ్యూరిటీ సమయంలో మీకు ఇస్తారు.

రూ. 1000 నుంచి కనీసం దీనిలో ఇన్వెస్ట్ చేసుకో వచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. ఈ పథకం లో మీరు రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు మెచ్యూరిటీ సమయంలో రూ. 7.25 లక్షల దాకా వస్తాయి. గతంలో రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ కి రూ. 7 లక్షల వరకు లభించేవి. ఇప్పుడు వడ్డీ రేటు పెరగడం వల్ల రాబడి కూడా రూ. 24 వేల వరకు పెరిగింది. కనీసం రూ. 1000 తో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌పై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒక సారి మార్చుతుంది. ఆ తరవాత మీకు నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేసుకో వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news