ఢిల్లీ టూర్: రెండవసారి మురళీధరన్ ను కలిసిన పవన్ కళ్యాణ్..

-

ప్రస్తుతం ఏపీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు. నిన్నటి నుండి ఢిల్లీ లోని బీజేపీ అధిష్టానం లోని కీలక నాయకులను కలుస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఈ మధ్యన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి మరియు కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ ఢిల్లీ పెద్దలకు వివరిస్తున్నారు. కాగా నిన్న బీజేపీ ఏపీ ఇంచార్జి మురళీధరన్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు మళ్ళీ రెండవసారి ఆయనను కలిసి వివిధ రాజకీయ అంశాల గురించి చర్చిస్తున్నారట.

ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా బీజేపీ జాయింట్ జనరల్ సెక్రటరీ శివప్రకాష్ , జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ లు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా మరియు హోమ్ మినిస్టర్ అమిత్ షా లను కలుసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news