హీరో రవితేజ కూతురు ముందు ఆ హీరోయిన్లంతా దిగదుడుపేనా..?

-

సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన నటనతో ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత మాస్ మహారాజా గా పేరు సంపాదించుకున్న రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ మొదలు పెట్టిన రవితేజ ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలో ఎన్నో కష్టాలు పడి నీకోసం సినిమా ద్వారా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా విజయం సాధించలేదు కానీ ఎక్కడ అధైర్య పడకుండా ఆ తర్వాత లీడ్ రోల్స్ చేస్తూ మెప్పించాడు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇడియట్ వంటి చిత్రాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు రవితేజ.

ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త హీరోలకు రవితేజ సినీ ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుంది.. ఇకపోతే రవితేజ సినీ ప్రస్థానం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. మరి ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి.. తక్కువ విషయాలు మాత్రమే తెలుసని చెప్పాలి.

ఇక ఆయన అసలు పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు.. 2002లో మేనమామ కూతురు కళ్యాణిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.. కొడుకు పేరు మహాధన్..ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరిని మెప్పించారు.

మరి కూతురు పేరు మోక్షద.. సోషల్ మీడియాలో కూడా తక్కువగా యాక్టివ్ గా కనిపించే మోక్షదా అందాన్ని చూస్తే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా ఆమె ఒక అందాల కుందనపు బొమ్మ అనడంలో సందేహం లేదు. ఇక ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే అన్నట్లుగా తెలుస్తోంది.. మొత్తానికైతే రవితేజ ఫ్యామిలీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news