కరీంనగర్​లో ఉద్రిక్తత.. బండి సంజయ్ అరెస్టు

-

కరీంనగర్​లో అర్ధరాత్రి సమయంలో హైడ్రామా చోటుచేసుకుందితీవ్ర ఉద్రిక్తత నడుమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలో తరలించారు. ఎందుకు అరెస్టు చేశారనే విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అయితే పదో తరగతి పేపర్ లీక్ ఘటనపై బండి సంజయ్ మీడియా సమావేశం పెడతారన్న సమాచారం మేరకు ముందస్తుగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

బండి సంజయ్ అత్తమ్మ ఇటీవల చనిపోగా.. 9 రోజుల కార్యక్రమం బుధవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జ్యోతినగర్​లోని వారి ఇంటికి సంజయ్ వచ్చారన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు. లోపలికి వెళ్లి సంజయ్​ను స్టేషన్​కు రావాల్సిందిగా ఏసీపీ కోరారు. ఎందుకు రావాలి? ఏ కేసులో తనను తీసుకెళ్తున్నారని సంజయ్ ప్రశ్నిస్తూ.. తనను అరెస్ట్ చేస్తున్నట్లు లోక్​సభ స్పీకర్​కు సమాచారం అందించారా? అని ప్రశ్నించారు.

పదో తరగతి పేపర్ల లీకేజీ వ్యవహారాన్ని బట్టబయలు చేస్తానన్న ఉద్దేశంతోనే అదుపులోకి తీసుకుంటున్నారా అని నిలదీశారు. తనను ముందస్తు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాచారం తెలియజేయాలని కోరుతుండగానే .. పోలీసు స్టేషన్‌కు వెళ్లాక విషయం చెబుతామంటూ పోలీసులు బలవంతంగా సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news