వివాదంలో ప్రభాస్ మూవీ “ఆదిపురుష్”…

-

టాలీవుడ్ హీరో ప్రభాస్ కు బాహుబలి లాంటి పీరియాడికల్ హిట్ తర్వాత, సరైన హిట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన సాహో మరియు రాధేశ్యామ్ లు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. అయితే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ మూవీ వచ్చినా ప్రభాస్ ఎక్కడా తగ్గకుండా వరుసగా సలార్, ఆదిపురుష్ , ప్రాజెక్ట్ కె, స్పిరిట్ మరియు మారుతీ డైరెక్షన్ లో రాజా డీలక్స్ అన్న చిత్రాలు క్యూలో ఉన్నాయి. కాగా ఇప్పటికే సాలార్ మరియు ఆదిపురుష్ లో షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ మూవీ ఒక వివాదంలో చిక్కుకుంది. ఈ మధ్యనే శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో రాముడు ధరించిన దుస్తులు అలాంటివి కావని…అవి హిందూ మత ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా ఉందని, అదే విధంగా జంజపు తాడు లేకుండా రాముడు ఏంటని ముంబైకి చెందిన వ్యక్తి కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news