నేటి నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు

-

వేసవి వచ్చేసింది.. పరీక్షల సీజన్​ మొదలైంది. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఇక ఉన్నత విద్యనభ్యసించేందుకు నిర్వహించే పరీక్షలు కూడా ఒక్కొక్కటిగా మొదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ్టి నుంచి దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈ పరీక్షలకు సుమారు 9.40 లక్షల మంది హాజరుకానున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది పరీక్షలు రాస్తారు. ఈనెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. దేశంలో మొత్తం 330 నగరాలు / పట్టణాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్షలు జరగనున్నాయి.

గత జనవరిలో జరిగిన తొలివిడత జేఈఈ మెయిన్‌కు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా వారిలో 8.24 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ఈసారి దరఖాస్తుదారుల సంఖ్య 80 వేలు పెరిగింది. తొలి, తుది విడతలో వచ్చిన స్కోర్‌లో ఉత్తమమైన దాన్ని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. సామాజిక వర్గాల వారీగా కటాఫ్‌ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు ఎంపిక చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news