వేసవిలో శారీరిక సమస్యలు మొదలు చర్మ సమస్యల వరకు ఎన్నో సమస్యలు కలుగుతుంటాయి. ఏది ఏమైనా వేసవికాలంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎండల వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలకి దూరంగా ఉండటమే మంచిది. వేసవిలో ఎక్కువ మంది వేడి వలన ఎండ వలన వేడి కురుపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా ఇవి వేసవిలో వస్తాయి. ఎంతో బాధ పెడతాయి చూడడానికి కూడా అసహ్యంగా కనబడుతూ ఉంటాయి. మొటిమల లాగ వేడుకూరుపులు కూడా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి.
ముఖం మీద శరీరం మీద కూడా వచ్చేస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఇంటి చిట్కాలు ని ట్రై చేయండి. శరీరంలో లోపల వేడి పెరిగిపోవడం వలన ఈ కురుపులు ఏర్పడతాయి. సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా అయినప్పుడు చర్మా రంధ్రాలు మూసుకుపోతాయి కురుపులు రావడానికి ఇదే ముఖ్యమైన కారణం. అలానే అంటు వ్యాధులు మధుమేహం మద్యం తీసుకోవడం చెడు ఆరోగ్యపు అలవాట్లు వలన కూడా ఇవి ఏర్పడతాయి.
ఆలివ్ ఆయిల్ తో వేడి కురుపులు దూరం:
ఆలివ్ ఆయిల్ తో మీరు ఈ కురుపుల్ని తగ్గించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో ఒక టీ స్పూన్ పసుపు వేసి ఆ ప్రదేశంలో రాయండి. 20 నుండి 30 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.
ఐస్ ముక్కలు:
ఐస్ ముక్కలతో కూడా ఈ సమస్య తొలగిపోతుంది. ఐస్ ముక్కలని ఒక గుడ్డులో వేసి చుట్టండి ఇబ్బంది ఉన్న చోట కొంచెం సేపు రుద్దుతూ ఉండండి. తర్వాత ముఖాన్ని ఒక క్లీన్ క్లాత్ తో తుడుచుకోండి.
కలబంద గుజ్జు:
ఇది కూడా బాగా పనిచేస్తుంది. రాత్రి మీరు నిద్రపోయే ముందు కలబంద గుజ్జు కురుపులు ఉన్నచోట అప్లై చేసి ఉదయాన్నే ముఖాన్ని కడుక్కోండి. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో మీరు కురుపులను దూరం చేసుకోవచ్చు.