తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ గవర్నర్ కు మధ్యన ఎప్పటి నుండో సంబంధాలు సరిగా లేవు. ఈ విషయం అందరికీ తెలిసిందే… అందుకే అధికారికంగా కొన్ని పనులలో జాప్యం జరుగుతూ ఉంది. కాగా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ దగ్గర కొన్ని రోజులుగా ఆమోదానికి ఆగిపోయిన 10 బిల్లులకు సంబంధించి సుప్రీమ్ కోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనితో దిగి వచ్చిన గవర్నర్ తమిళి సై ఈ బిల్లుపై ఆమోదం విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులలో మూడింటిని మాత్రమే ఈమె ఆమోదించింది. వాటిలో రెండు బిల్లులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే పంపించింది.
మరో రెండు బిల్లుల్లను మాత్రం రాష్ట్రపతికి ఫార్వర్డ్ చేసింది. మరి రాష్ట్రానికి మరియు రాష్ట్రపతి వద్దకు పంపిన నాలుగు బిల్లుల విషయంలో కేసీఆర్ కు గవర్నర్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. మరి ఆ బిల్లులు ఏమిటో ? ఎప్పుడు ఆమోదం పొందుతాయో తెలియాల్సి ఉంది.