సీఎం జగన్ పై కోడికత్తి దాడి కేసు విచారణ ఈ నెల 13 కు వాయిదా

-

విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై జరిగిన దాడి కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో నేడు విచారణ జరిగింది. ముఖ్యమంత్రిగా పలు కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉన్నందున తాను హాజరు కాలేనని సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లేదా ఇతర మార్గాల ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని కోరారు. దీంతో ఇవాళ విచారణ షెడ్యూల్ ని కోర్టు రద్దు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏ, ముద్దాయికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ సందర్భంగా వైసీపీ లీగల్ సెల్, జగన్ తరపు న్యాయవాది ఇంకోలు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం తరఫున రెండు పిటిషన్లు ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరామన్నారు. 2018 లో సినీ నటుడు శివాజీ “ఆపరేషన్ గరుడ” ద్వారా దాడి జరుగుతుందని ముందే చెప్పారని.. ఈ కేసులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఈ కేసులో లోతైన విచారణ చేయాలని కోరామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news