125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

-

హుస్సేన్ సాగర్ తీరంలోని 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బౌద్ధ గురువుల ప్రార్ధనల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ మహా విగ్రహాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహంపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.

నూతన సచివాలయం, ఎన్టీఆర్ ఘాట్, పీవీ మార్గ ప్రాంతాలు జన సందోహంగా మారాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కాగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని 98 ఏళ్ల పద్మభూషణ్, రామ్ వంశీ సుతార్ రూపొందించారు. అంబేద్కర్ విగ్రహాన్ని రెండు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశారు. 2016 ఏప్రిల్ 14న రూ.146 కోట్లతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది.

Read more RELATED
Recommended to you

Latest news