షెర్లిన్ చోప్రాకు చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

-

షెర్లిన్ చోప్రా.. ఈ పేరు బాలీవుడ్ ప్రేక్షకులందరికీ అత్యంత సుపరిచితం. ఈ హీరోయిన్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మాటల్లో నిలుస్తూ ఉంటుంది. ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదం తన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్ కి సంబంధించి ప్రముఖ శృంగార తారల్లో షెర్లిన్ చోప్రా ఒకరు. తాజాగా శేర్లిన్ చోప్రా ఒక వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం నుంచి బయటపడటానికి పోలీసులను సైతం ఆశ్రయించినట్లు సమాచారం.

కాగా బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు ఒక ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఒక వ్యక్తి తనను వేధిస్తున్నాడని చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ చెల్లించోప్రా ముంబై పోలీసుల్ని ఆశ్రయించింది కాగా ఒక వీడియో రికార్డింగ్ విషయంలో ఈ వివాదం మొదలైందని వీడియో రికార్డింగ్కు తాను ఒప్పుకున్నానని కానీ కొన్ని కారణాలవల్ల షూటింగ్లో పాల్గొన్న లేకపోయారని తెలిపింది. ఈ విషయంలో తనను ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తాను తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి కూడా తాను ఒప్పుకున్నానని చెప్పింది. అయినా సరే తనపై కోపంతో పగబట్టి వేదిస్తున్నాడని తెలిపిన ఈ నటి ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.ఈ విషయంపై ముంబై పోలీసులు విచారణ చేపట్టారు.

Sherlyn Chopra Photos [HD]: Latest Images, Pictures, Stills of Sherlyn ...

కాగా గతంలో సైతం షేర్లిన్ కు ఇలా పలు విషయాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై షేర్లిన్ పలు రకాలుగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఫేస్ చేస్తున్న దర్శకుడు సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ రియాల్టీ షోకు తీసుకోవడంపై ఆమె మండిపడింది. సల్మాన్ ను ఘాటుగా విమర్శించింది. ఈ విషయంపై అప్పట్లో తెగ వైరల్ గా మారింది షేర్లిన్.

Read more RELATED
Recommended to you

Latest news