నీళ్లు తాగుతున్నా దాహంగా ఉందా..? అయితే వేసవిలో ఇలా చేయండి..!

-

వేసవికాలంలో దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా కూడా దాహంగానే అనిపిస్తూ ఉంటుంది. వేసవికాలంలో ఎక్కువ నీళ్లు తీసుకుని హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం. లేక పోతే డిహైడ్రేషన్ మొదలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ఈరోజు మనతో కొన్ని అద్భుతమైన విషయాలని పంచుకున్నారు. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకి మూడు నుండి నాలుగు లీటర్ల నీళ్లు కచ్చితంగా తీసుకోవాలని ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుకోవాలని నీళ్లతో పాటుగా నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

 

నీళ్లు ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వలన శరీరం చల్లగా మారుతుంది సమస్యలు ఉండవు. ఒక్కొక్క సారి సోడియం, పొటాషియం తగ్గిపోవడం వలన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ గా ఉండవు అలాంటి సమయంలో నీళ్ళు తాగినా కూడా ఇంకా దాహం అనిపిస్తుంది. అలాంటప్పుడు రెండు మూడు పండ్లని కాస్త పింక్ సాల్ట్ వేసుకుని తీసుకుంటే మంచిది. హిమాలయన్ సాల్ట్ మనకి దొరుకుతూ ఉంటుంది. దానిని మీరు పండ్ల తో పాటు తీసుకుంటే ఈ సమస్య ఉండదు.

దాహం తీరుతుంది. దాహం తగ్గాలంటే మీరు పదే పదే కంగారుగా నీళ్లు తాగడం కంటే ఒక దగ్గర కూర్చుని ఆ తర్వాత స్థిమితంగా ఒక గ్లాసు నీళ్లు తాగండి. నీళ్ళని భోజనం తిన్న తర్వాత భోజనానికి ముందు తీసుకోకూడదు. నీళ్లు తినడానికి అరగంట ముందు లేదంటే అరగంట తర్వాత తీసుకుంటే మంచిది. తినడానికి ముందు తిన్న తర్వాత తీసుకుంటే అజీర్తి సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news