లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే… ఈ పొరపాట్లని అస్సలు చేయకండి..!

-

ఈ మధ్యకాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా మంది అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది లివర్ సమస్యలతో బాధ పడుతున్నారు అలాంటి వాళ్ళు కచ్చితంగా దీనిని తెలుసుకోవాలి.

 

లివర్ మన శరీరంలో ఉండే ముఖ్య అవయవం. దీని వలన బాగా జీర్ణం అవుతుంది అలానే చెడు పదార్దాలు బయటకు వెళ్తాయి లివర్ ఆరోగ్యం కనుక పాడైతే పూర్తి ఆరోగ్యం పాడైపోతుంది. లివర్ హెల్త్ పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి. మనం తిన్న ప్రతిదీ మనం తాగే ప్రతిదీ కూడా లివర్ కి చేరుతుంది. లివర్ వీటిపై పక్కా పని చేస్తుంది. లివర్ లేకపోతే మనం బతకలేము.

సరైన జీవన విధానం లేకపోవడం సరైన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఆహారం విషయంలో తప్పులు చేయడం వలన బాగా బరువు పెరిగిపోతూ ఉంటాము దీంతో డయాబెటిస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి
లివర్ ఆరోగ్యం బాగుండాలంటే కొవ్వు ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. ఆల్కహాల్ ని తీసుకోకూడదు. స్మోకింగ్ చేయకూడదు. అంతే కాక కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వలన కూడా లివర్ సమస్యలు వస్తాయి ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. లివర్ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యానికి హాని చేసే పద్ధతులని పాటించద్దు.

Read more RELATED
Recommended to you

Latest news