సాక్షిలో శృంగార వర్ణన చూస్తుంటే..సూత్రధారులు వీళ్లేనని అనిపిస్తోంది – RRR

-

సాక్షిలో శృంగార వర్ణన చూస్తుంటే..సూత్రధారులు వీళ్లేనని అనిపిస్తోందని రఘురామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి దినపత్రిక కథనాలు, శృంగార వర్ణనలను చూస్తుంటే, అసలు సూత్రధారులు వీళ్లేనా అనే అనుమానం ప్రజల్లో కలుగుతుందని, సాక్షి దినపత్రిక కథనాలను చూస్తుంటే, ప్రజల అనుమానం కూడా నిజమేనేమో అనిపిస్తుందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

ప్రభుత్వ సొమ్ముతో నాలుగు లక్షల సాక్షి దినపత్రిక ప్రతులను విక్రయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకుంటే మంచిదని, లేకపోతే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఉషోదయ పబ్లికేషన్స్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు.

హైకోర్టులో వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచడంతో, ఉషోదయ పబ్లికేషన్ సుప్రీం కోర్టు తలుపులు తట్టిందని తెలిపారు. సుప్రీం కోర్టు ఈ కేసులో జోక్యం చేసుకుంటూ, కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇవ్వడం లేదు అంటే, ప్రధాన న్యాయమూర్తి గారు బిజీగా ఉండి ఉంటారని, మీరు అర్జెంటుగా కేసును తేల్చేయమని కోరడం భావ్యం కాదని ధర్మాసనం చమత్కర వ్యాఖ్యలు చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news