దేశీయంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్బీఐ), రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా తమ కస్టమర్లకు షాకిచ్చాయి. మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించాయి. నెలకు ఒక్కసారి మాత్రమే ఇతర బ్యాంకుల మైక్రో ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించాయి.
ఇప్పటి వరకు ఈ అవకాశం మూడుసార్లు ఉండేది. ఇది ఖాతాదారులకు తీవ్ర నిరాశ కలిగించే అంశం. ప్రభుత్వపు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్‌లో భాగస్వామ్యం కాని ఖాతాదారులు నెలకు ఐదు లావాదేవీలు నిర్వహించొచ్చు. ఇతర బ్యాంకుల మైక్రో ఏటీఎంలను ఉపయోగించినప్పుడే ఈ రూల్స్ వర్తిస్తాయి.