ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌, ‘థ్రెడ్స్‌’ చూశారా!

-

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇన్ స్టాగ్రామ్ ను డెవలప్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అందులో మరికొన్ని మార్పులు చేస్తూ కొత్త యాప్స్ ను తీసుకొస్తోంది. తన ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేక కెమెరా-ఫస్ట్ మెసేజింగ్ యాప్ “థ్రెడ్స్” ను లాంచ్‌ చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. థ్రెడ్స్ ద్వారా, వినియోగదారులు తమ సన్నిహితులతో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్, షేర్ లొకేషన్, బ్యాటరీ స్టేటస్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చని ఫేస్‌బుక్‌ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

సన్నిహితులకోసం ప్రత్యేకంగా ఈ యాప్‌ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇన్ స్టాగ్రామ్ ఫుల్ వెర్షన్ అనుకుంటే థ్రెడ్స్ ని స్పెషల్ వెర్షన్ అనుకోవచ్చు. యాపిల్, గూగుల్-బ్యాక్డ్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ద్వారా నడిచే స్మార్ట్‌ఫోన్‌లలో ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆవిష్కరించింది. ఫేస్‌బుక్‌ డేటా లీక్‌ సృష్టిస్తున్న వివాదం నేపథ్యంలోఈ యాప్‌ చాలా సురక్షితమైందని ఫేస్‌బుక్‌ హామీ ఇచ్చింది.

థ్రెడ్స్ లో ఇన్ స్టాగ్రామ్ ఫ్రెండ్స్ సులభంగా యాడ్, డిలీట్ చేసుకోవచ్చు. అలాగే థ్రెడ్స్ కెమెరాలో షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. అంటే మీరు తీసిన ఫొటో వెంటనే షార్ట్ కట్ లో ఉన్న ఫ్రెండ్ కి పంపించొచ్చు. ఈ ఫీచర్ ను స్నాప్ ఛాట్ నుంచి స్ఫూర్తి పొంది తీసుకొచ్చారు. అలాగే తమ పోస్ట్‌లో ఎవరు చూడవచ్చో, చూడకూడదో “క్లోజ్ ఫ్రెండ్స్” ఫీచర్‌ ద్వారా నియత్రించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news