లక్కీ ఛాన్స్ కొట్టేసిన సుడిగాలి సుదీర్.. త్వరలోనే ప్రభాస్ దర్శకుడుతో మూవీ!

-

Sudigali Sudhir: సుడిగాలి సుదీర్.. ఒక సాధారణ మెజీషియన్ గా తెలియని స్టార్ట్ చేసిన జబర్దస్త్ లో వచ్చిన అవకాశంతో తనలో ఉన్న టాలెంట్ను నిరూపించుకున్నారు. తనకంటూ ప్రత్యేక క్రియేట్ చేసుకున్న సుధీర్ యాంకర్ రష్మితో చేసిన కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. బుల్లితెర హీరోగా మంచి పేరు సంపాదించుకున్న సుదీర్ ఇక్కడ నటిస్తూనే యాంకరింగ్ చేస్తూ సినిమాల వైపు అడుగులు వేశారు. ఇప్పటికే గాలోడు సినిమాతో హీరోగా పరిచయమైన సుధీర్.. తాజాగా ప్రభాస్ డైరెక్టర్ తో ఓ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

బుల్లి తెరపై అలరించిన సుధీర్ గాలోడు సినిమాతో తన టాలెంట్ నుండి నిరూపించుకున్నారు. ఈ సినిమా సక్సెస్ తో హీరోగా వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ సక్సెస్ తో టీవీ షోలు కూడా మానేసి.. హీరోగా నిలబడాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు సుధీర్. కొన్నాళ్ళుగా బుల్లితెరపై సందడి చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇక ఇప్పుడేమో అదిరిపోయే క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. గాలోడు లాంటి మాస్ ఎంటర్ టైనర్ తో మంచి కలెక్షన్స్ అందుకున్న సుదీర్ నెక్స్ట్ సినిమాపై ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే తాజాగా ప్రభాస్ డైరెక్టర్ దశరధ్ తో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.

Sudigali Sudhir
Sudigali Sudhir

 

ప్రస్తుతం సుధీర్ కాలింగ్ సహస్ర అనే మూవీ చేస్తున్నాడు. కానీ ఆ సినిమానుంచి ఇంత వరకూ ఎటువంటి అప్డేట్స్ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరగడం ఉందా లేక వాయిదా పడనుందా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది కానీ సుధీర్ మాత్రం ప్రభాస్ డైరెక్టర్ దశరధ్ తో సినిమా ఫిక్స్ అయ్యిందని మాత్రం ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దశరథ్ ఇప్పటికే ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం పెద్దగా అవకాశాలు రాకపోయినప్పటికీ ఒక శౌర్య సినిమా చేశారు. నాగార్జునతో సంతోషం లాంటి హిట్ కొట్టిన దశరథ్ ప్రస్తుతం కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడని అర్థమవుతుంది. అందుకే సుదీర్ తో ఓ సినిమా చేయటానికి సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఇంకా అధికార ప్రకటన రావలసి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news